Header Banner

ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు..!లక్ష మందికి లబ్ది! దరఖాస్తు చేసుకోవడం ఇలా!

  Fri Feb 28, 2025 10:39        Employment

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేద మహిళలకు తీపికబురు చెప్పింది.. వారి ఉపాధి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పేద మహిళలకు కుట్టు మిషన్లను ఉచితంగా అందించనుంది.. అలాగే టైలరింగ్‌లో కూడా శిక్షణ ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు చెందిన దాదాపు లక్ష మంది పేద మహిళలకు కుట్టు మిషన్లను అందిస్తారు.. 2024-25 సంవత్సరానికి సంబంధించి వీటిని పంపిణీ చేస్తారు. అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే 10 రోజుల్లో శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడతారు. మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తి చేశారు. బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల మహిళలతో పాటుగా ఎస్సీ మహిళలకు కూడా ఇలాగే త్వరలో ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 25 కోట్లకు టోకరా.. కట్ చేస్తే.. తమన్నా, కాజల్‌ను విచారించనున్న పోలీసులు!

 

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తులు స్వీకరిస్తే లబ్ధిదారులు ఎక్కువమంది వచ్చే అవకాశం ఉంది. అందుకే తొలి విడతగా (2024-25కు) 26 జిల్లాల పరిధిలో ఉన్న 60 నియోజకవర్గాల్లో ఈ ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత వచ్చే ఏడాది మరో 60 నియోజకవర్గాలు.. అనంతరం మిగిలిన నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గం నుంచి 2 వేల నుంచి 3 వేల మంది బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల మహిళల నుంచి అర్హులను గుర్తిస్తారు. ఒకవేళ ఎక్కువ ధరఖాస్తులు వస్తే వాటిని స్క్రూట్నీ చేసి ఆ తర్వాత విడతలో పరిగణలోకి తీసుకుంటారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఈసారి ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వం కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే టైలరింగ్ శిక్షణ ఇచ్చేది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే 40శాతం మేర శిక్షణ కోసం సెంటర్లను గుర్తించి.. ఒక్కో సెంటర్‌లో 30 నుంచి 50మందికి శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాదు శిక్షణ కార్యక్రమంలో కనీసం 70 శాతం హాజరు ఉన్న వారికే ఉచితంగా కుట్టుమిషన్‌ అందజేస్తారు. ఈ మేరకు మహిళ హాజరు నమోదుకు ప్రత్యేక యాప్‌ను కూడా సిద్ధం చేశారు అధికారులు. మొత్తం మీద పేద మహిళ కోసం ప్రభుత్వం ఉచిత కుట్టుమిషన్లు అందించబోతోంది. మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటుగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #FreeSewingMachines #WomenEmpowerment #SkillDevelopment #APGovernment #TailoringTraining #SelfEmployment #WelfareScheme #BC #EWS #SCWomen #APSchemes #FinancialIndependence #WomenWelfare #SewingTraining #